ఫ్రస్ట్రేషన్‌ వల్లే ఇలా చేస్తారు : కేఏ పాల్‌

7 Apr, 2019 20:15 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై రఘురామకృష్ణం రాజుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజుపై దాడి చేయడం.. హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఏ పాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఓటమి భయం పట్టుకుంటేనే ఇలాంటి దాడులు చేస్తారని ఫ్రస్ట్రేషన్‌ వల్లే ఇలా ప్రవర్తిస్తారని దుయ్యబట్టారు. సంప్రదింపులు, చర్చలు చేసుకోవాలి తప్పా భౌతిక దాడులు సత్సంప్రదాయం కాదని సూచించారు.

ఇటీవలె కొత్తాడ గ్రామంలో రఘురామకృష్ణంరాజుపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి యువకులను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి..  నాగబాబు ట్వీట్‌పై అనుమానాలు : రఘురామ కృష్ణంరాజు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు