ఆయన ప్రసంగాన్ని తప్పుపట్టటం సరికాదు

17 Jun, 2019 10:10 IST|Sakshi

సాక్షి, అ‍మరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టటం సరికాదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ మొదలైంది. కాకాని గోవర్థన్‌ రెడ్డి గవర్నర్‌ ప్రసంగాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు తమ స్వార్థం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పోలవరం అంచనాలను పెంచిందన్నారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ప్రజలు దౌర్భాగ్యమైన పాలనను చూశారన్నారు.

మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేబినేట్‌లో స్థానం కల్పించామని తెలిపారు. ప్రజలు పూర్తిగా విశ్వాసం, నమ్మకంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారని అన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ..

ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

నగదు వసూలు చేస్తే జైలుకే

ఎంపికైతే ఏం చేస్తారు?

గ్యాస్‌ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది

రాజాంలో దొంగల హల్‌చల్‌

దెయ్యం.. ఒట్టి బూటకం 

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

బీహార్‌ దొంగల బీభత్సం

బది'లీలలు' ఏమిటో..?

జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే

సిరా ఆరకముందే 80% హామీల అమలు

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘సదావర్తి’పై విజిలెన్స్‌ విచారణ

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం

‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం

లంచాలు లేకుండా పనులు జరగాలి

‘కాపు’ కాస్తాం

ఏపీ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు తీరు ఇంకా మారలేదు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఏపీకి కొత్త గవర్నర్‌

చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్‌

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను