ఆత్మగౌరవం కాపాడేందుకే రాజీనామా

24 Jun, 2018 11:03 IST|Sakshi

యుద్ధం, స్నేహం సోమిరెడ్డికి బాగా తెలుసు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శని వారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌æ ప్రజలం దరూ రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలను కీర్తిస్తున్నట్టు తెలి పారు. టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి దొంగ దీక్షలు చేస్తూ, పూటకో మాట, రోజుకో ఎత్తుగడతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. 

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి ప్రత్యేకహోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గార్చి, ఇప్పుడు ఎంపీ ల రాజీనామాలపై తన మంత్రులతో ఎదురు దాడి చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాను సజీవంగా ఉంచిన ఘనత వైఎస్సార్‌ సీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు.

యుద్ధం, స్నేహం సోమిరెడ్డికి బాగా తెలుసు
యుద్ధం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా టీడీపీకే తెలుసని మం త్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే కాకాణి తిప్పికొట్టారు. కాంట్రాక్టర్లు, మిల్లర్లు ముడుపులు ఇవ్వకుంటే యుద్ధం చేయడం, ముడుపులు చెల్లింస్తే స్నేహం చేయడం ఆయనకు మామూలేనన్నారు. నాలుగు పర్యాయాలు వరుసగా ఓటమి చవిచూసి, దొడ్డిదారిన మంత్రైన సోమిరెడ్డికి ప్రజల ఓట్లతో వచ్చిన పదవి విలువ తెలియదన్నారు. 

రాజీనామా చేసిన ఎంపీలను జీతాలు వదులుకున్నారని సోమిరెడ్డి అవహేళన చేయడాన్ని చూస్తే ఆయన జన్మలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదన్నారు.  జేబులు నింపుకోవడం తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి తెలియని నాయకుడికి తమ ఎంపీల త్యాగాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పొదలకూరు సర్పంచ్‌ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, పలుకూరు పోలిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హోదాపై కేంద్రాన్ని నిలదీసిన మిథున్‌ రెడ్డి

వైఎస్సార్‌ హయాంలోనే చింతలపుడి ప్రాజెక్టు

అడ్డంగా దొరికి.. పారిపోయి వచ్చారు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు

గంటపాటు లిఫ్టులో నరకం

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లిప్ లాక్  సినిమా కాదు: విజయ్‌ దేవరకొండ

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'