కరోనా : మహిళకు చీరకొంగుతో మాస్క్‌ కట్టిన ఎంపీ

30 Mar, 2020 12:29 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ప్రజాప్రతినిధులంతా ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగారు. మాస్కులు పంపిణీ చేస్తూ, లాక్‌డౌన్‌లో అమలవుతున్న చర్యలను సమీక్షిస్తున్నారు. సోమవారం కాకినాడ ఎంపీ వంగ గీత సామర్లకోట కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్‌కు వచ్చిన మహిళలకు మాస్కులు లేకపోవడంతో మహిళల చీరలతో ఆమె స్వయంగా మాస్కు కట్టారు. (ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు)

బయటకు వచ్చేయుందు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎంపీ సూచించారు. అలాగే మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఎంపీ గీత అవగాహన కల్పించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కాగా ఎంపీ వెంట వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఇతర ప్రజాప్రతినిధుతు, అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు