‘సెజ్‌ అక్రమమైతే భూములు ఇప్పించండి’

31 Jul, 2018 15:21 IST|Sakshi

సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) పేరుతో తమ భూములను లాక్కొని వేధింపులకు దిగుతున్నారని కాకినాడ సెజ్‌ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డిని మంగళవారం కలిసిన నిర్వాసితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ భూముల్లో ఏర్పాటు చేయనున్న సెజ్‌ అక్రమమో.. సక్రమమో తేల్చాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాకముందు మీకు నేనున్నాంటూ హామీల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబు నాయుడు.. పదవిలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెజ్‌ అక్రమమైతే తమ భూములు తిరిగి ఇప్పించాలనీ వైఎస్‌ జగన్‌ను కోరారు. జగన్‌తోనే తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు