డాక్టరవుతావని కలగంటిమి బిడ్డా..!

1 Feb, 2014 02:42 IST|Sakshi
డాక్టరవుతావని కలగంటిమి బిడ్డా..!
  •     అదృశ్యమైన బాలిక..మృతదేహంగా లభ్యం
  •      ఊహ అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ
  •       శోకసంద్రంలో తల్లిదండ్రులు
  •      మల్లారెడ్డిపల్లిలో విషాదం
  •   హసన్‌పర్తి/చిట్యాల, న్యూస్‌లైన్ : తల్లి నిన్ను డాక్టర్‌గా చూడాలని కల గంటిమి.. ఎంత పనిచేశావు బిడ్డా.. అప్పుడే నీకూ నూరేళ్లు నిండా యా తల్లి ? అంటూ ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటారుు. మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ సూరయ్య, నిర్మల దంపతుల కూతురు ఊహ(15) జనవరి 21న చిట్యాల సాంఘిక సంక్షే మ హాస్టల్ నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా ఆమె చదువుతున్న పాఠశాల సమీపంలోని బావిలో శుక్రవారం మృతదేహమై కనిపించింది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. బిడ్డను తల్చుకుని బోరున విల పించారు.దీంతో మల్లారెడ్డిపల్లిలో విషాదం అలుముకుంది.
     
    వార్డెన్, ప్రిన్సిపాల్ మందలించారనే..
     
    సంక్రాంతి పండుగ తర్వాత ఒకరోజు ఆలస్యంగా జనవరి 21న హాస్టల్‌కు వెళ్లిన ఊహను వార్డెన్, ప్రిన్సిపాల్ మందలించారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఊహ అదే రోజు మధ్యాహ్నం బాత్‌రూంకని వెళ్లి తిరిగి కనిపించలేదు. 22న ఉద యం ఊహ కనిపించడం లేదని పిల్లలు చెప్పడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊహ అదృశ్యానికి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లే కారణమని తల్లిదండ్రులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఊహ వ్యవసాయబావిలో శవమై కనిపించ డం చర్చనీయూంశమైంది.

మరిన్ని వార్తలు