కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్' ఫస్ట్ లుక్

17 Nov, 2014 07:34 IST|Sakshi
కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్' ఫస్ట్ లుక్

హైదరాబాద్: వినూత్న సినిమాలకు, వైవిద్యమైన పాత్రలకు పెట్టింది పేరైన ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘టిప్పు సుల్తాన్' సినిమా చేయబోతున్నాడు. మైసూర్ కింగ్ టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు.

కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్’(ఫస్ట్ లుక్) ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం-2' చిత్రానికి తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సూపర్ హిట్ మూవీ ‘విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘టిప్పు సుల్తాన్' చిత్రం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు