ప్రభుత్వం వైద్యంపై నమ్మకం పెంచండి:మంత్రి కామినేని

4 Aug, 2014 16:24 IST|Sakshi
ప్రభుత్వం వైద్యంపై నమ్మకం పెంచండి:మంత్రి కామినేని

విశాఖ:నగరంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ వైద్యం బాగుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎక్కడా లేదని దుయ్యబట్టారు. అవినీతిలో కేజీహెచ్ నంబర్ వన్ లో ఉందని ఆయన విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కామినేని..  ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం సరిగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైద్యం బాగుందని చెప్పుకునే పరిస్థితి కల్పించి.. సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరో మూడు నెలల్లో విమ్స్ తొలివిడత పూర్తవుతుందని కామినేని తెలిపారు.

 

ఇదిలా ఉండగా ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీం కోర్టు తీర్పును మంత్రి స్వాగతించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి భవిష్యత్తుకు ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. కౌన్సిలింగ్ పూర్తి చేయడానికి సహకరించాలని విన్నవించారు.

>
మరిన్ని వార్తలు