దసరాలోపు దుర్గమ్మ ఘాట్‌ రోడ్డు

9 Aug, 2017 16:05 IST|Sakshi
విజయవాడ: దసరాలోపు ఘాట్‌ రోడ్డు నిర్మాణం ​పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కనకదుర్గ ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని మాడపాటి సత్రంలో దుర్గగుడి తొలి పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కనకదుర్గమ్మ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. దసరా ఏర్పాట్లపై పాలకమండలి సమావేశంలో చర్చించింది. దసరాను ప్రభుత్వ పండుగగా ప్రకటించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదన్నారు.
 
దసరాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో చర్చించిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని, దాదాపు రూ.10 కోట్లు అడుగుతున్నట్లు, 70 వేల మంది దుర్గమ్మ దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు వారు వివరించారు. దుర్గమ్మకు సోలార్‌ వెలుగుల కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
మరిన్ని వార్తలు