రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

17 Aug, 2019 12:03 IST|Sakshi

సాక్షి, కృష్ణా: నిన్న సాయంత్రం కంచికచెర్ల మండలం చెవిటికల్లు లక్ష్మయ్య వాగులో గల్లంతైన పదంకొడేళ్ల బాలిక తులసి ప్రియ మృతదేహం శనివారం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోలీసులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
పడవ ప్రమాదంలో మృతి చెందిన తులసి ప్రియ మృతదేహానికి ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ రావు నివాళులర్పించారు. తులసి ప్రియ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. అంతేకాక మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు జగన్‌మోహన్‌ రావు ప్రకటించారు.

పవిత్రసంగమం వద్ద భారీ వరద
జిల్లాలోని పవిత్ర సంగమం వద్ద భారీగా వరద ప్రవాహం చేరుతుంది. ఇప్పటికే పవిత్ర సంగమం వద్ద పది అడుగుల లోతున నీటి ప్రవాహం చేరింది. పెర్రీలో వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఏపీ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కోరారు.విజయవాడ పట్టణంలోని పైపుల రోడ్డు 57వ డివిజన్‌ ముంపు ప్రాంతాల్లో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణ పర్యటించారు. వరద పరిస్థితులపై సమీక్షించారు.

మరిన్ని వార్తలు