గతంలో పవన్‌ ఏరోజైనా నోరు విప్పాడా?: కన్నబాబు

9 Dec, 2019 19:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మేలు చేస్తుంటే కొందరు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ​కురసాల కన్నబాబు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మండపేటలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అంతా సక్రమంగా జరుగుతుంటే పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. గతంలో రైతుల కోసం ఏ రోజైనా పవన్‌ కళ్యాణ్‌ నోరు విప్పాడా? అని ప్రశ్నించారు. 

మంత్రి కన్నబాబు సోమవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ‘60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేశాం. ఇందుకోసం 1283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు కూడా ఇస్తున్నాం. 5 రోజుల్లో మొత్తం డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 3,62,955 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దీనికి సంబంధించిన రూ. 407 కోట్లు రైతులకు చెల్లించాం. రైతులకు రోజూ సుమారు రూ. 50 కోట్లు చెల్లిస్తున్నాం. రైతులకు ధాన్యం కొనుగోలు చేశాక మెసేజ్‌లు పంపుతున్నారు’ అని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు