‘కన్నా.. వాస్తవాలు తెలుసుకోండి’

1 Mar, 2020 15:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్‌ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్‌ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్‌లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్‌లో ఉన్నారని పేర్కొంది. 

వెయిటింగ్‌లో ఉన్న పోలీసు అధికారులకు పోస్టింగులివ్వండి: కన్నా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలంగా పోస్టింగ్‌ ఇవ్వక వెయిటింగ్‌లో కొనసాగుతున్న పోలీసు అధికారులకు వెంటనే పోస్టులను కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు వెయిటింగ్‌లో ఉంచిన పోలీసులందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు