కనుల పండువగా కుంకుమార్చన

17 Jan, 2014 03:49 IST|Sakshi
కనుల పండువగా కుంకుమార్చన
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్ : కుంచాలకుర్మయ్యపేట గ్రామంలోని శ్రీచక్రపురం గురువారం భక్తులతో కిటకిటలాడింది. కనుమ పండుగ సందర్భంగా అమ్మవారికి ఘనంగా కుంకుమపూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. శ్రీచక్రార్చన, విశేష పూజలు ఆలయ వ్యవస్థాపకుడు బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో జరిగాయి. శివాలయం, బాబా మందిరంలో రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభాస్కరశర్మ మాట్లాడుతూ కనుమ రోజున ప్రతి జీవిలోను భగవతస్కారం ఉంటుందన్నారు. అందు కే పూర్వికులు కనుమ రోజున పశువులకు పిండివంటలు పెట్టేవారని, అయితే ఇప్పుడు ఆ సంప్రదాయాలను పక్కన పెడుతున్నారన్నారు. లలితా సహస్రనామాలతో ఆరు వందల మంది మహిళలతో కుంకుమార్చన చేయించారు. అనంతరం ఖడ్గమాల లలితా పారాయణం జరిగింది. 13 వందల మంది భక్తులకు అన్న సంతర్పణ చేయించారు. కార్యక్రమంలో రుత్వికులు ఎం.సంతోష్‌కుమార్, విశ్వనాథ్‌శర్మ, అనంతశర్మ, టి.రమేష్, బాబి, నారాయణరావు, అయ్యప్పశ్రీను పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు