జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు: జక్కంపూడి

24 Jun, 2020 17:17 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎ‍స్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కాపులందరి తరుపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కాపులకు నేను ఉన్నాను అంటూ వైస్సార్ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా వసతి, జగనన్న విద్యా దీవెన ద్వారా లక్షలాది మంది కాపులకు మేలు జరిగింది. గత ప్రభుత్వం వలన కాపులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాదికి 15 వేలు చొప్పున ఐదేళ్లు కాపు నేస్తం ద్వారా ఇవ్వనున్నారు. కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. ఏడాదికి 400 కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదు. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టాలని అడిగితే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. ('వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభం)

కాపులకు ఇచ్చిన హామీలు కంటే మిన్నగా సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు సీఎం జగన్‌ రూ. 4800 కోట్లు ఖర్చు చేశారు. కాపులకు ఇచ్చిన ఏ హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. గత పాలకులు కాపులను గాలికి వదిలేశారు. కాపులకు అండగా నిలుస్తున్నారు. కాపు నేస్తం ద్వారా రెండు లక్షల 36 వేల మందికి లబ్ది కలిగింది. కాపు నేస్తంకు రూ. 354 కోట్లు నిధులు విడుదల చేశారు. వంగవీటి రంగాను చంపించిన దగ్గర నుంచి చూస్తే కాపులకు చంద్రబాబు చేసింది ఏమీలేదు. కాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే చంద్రబాబు వాడుకున్నారు. కాపులకు మేలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతార’ని జక్కంపూడి రాజా అన్నారు. (వారికి కూడా కాపునేస్తం తరహా పథకం)

మరిన్ని వార్తలు