కత్తి మహేష్‌ ఎన్నికల ప్రచారం

2 Apr, 2019 14:26 IST|Sakshi
సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో కత్తి మహేష్‌

ముప్పాళ్ళ(సత్తెనపల్లి): టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్‌ సీపీకి అండగా ఉండాలన్నారు. 

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. 

మరిన్ని వార్తలు