టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం :మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 

12 Mar, 2019 10:14 IST|Sakshi
సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

సాక్షి, బనగానపల్లె: రాష్ట్రంలో 58 నెలల పాటు అరాచక, అవినీతి పాలన సాగించిన టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర సివిల్‌సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా బనగానపల్లెలో ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో టీడీపీ అరాచకాలు మితిమీరి పోయాయన్నారు. ప్రజలతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి తప్పులు చేయనప్పటికీ టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఇంకా వారి ఆరాచకాలను భరించే స్థితిలో ప్రజలేరన్నారు.

సీఎం చంద్రబాబు వయసు మీద పడుతుండటంతో ప్రత్యేక హోదా విషయంలో ఒక సారి హోదా కావాలంటారు, మరోసారి ప్రత్యేక ప్యాకేజీ ముద్దంటూ మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని కాటసాని ఆరోపించారు. తమ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి పెద్దన్నలా, పెద్ద దిక్కులా ఉంటారన్నారు.

వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రజలందరీ ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యం రావడానికి ఎన్నో రోజులు లేవని, త్వరలోనే టీడీపీ నాయకులు వడ్డీతో సహా వారు మూల్యం చెల్లించుకుంటారన్నారు. 

నియోజకవర్గంలో రామరాజ్యం : 
చల్లా, కాటసానిల కలయికతో నియోజకవర్గంలో రామరాజ్యం నెలకొంటుందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ఎర్రబోతుల అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు  ఎర్రబోతుల తనయుడు ఉదయభాస్కర్‌రెడ్డి, కాటసాని ప్రసాద్‌రెడ్డి, కోడూరు రామచంద్రారెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, అంబటి గురివిరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, రామాంజనేయులు, పులి ప్రకాష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బెడదల చంద్రశేఖర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బండి బ్రహ్మనందారెడ్డి, కాటసాని రామక్రిష్ణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, తులసిరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, నారాయణ, నారాయణరెడ్డి, కుమార్‌రెడ్డి, సురేంద్రబాబు, రమణ, చీకటి చిన్న ఈశ్వరయ్య, చాంద్‌బాష, హరి, వెంకటరామిరెడ్డి, చిన్న రామక్రిష్ణారెడ్డి, అల్లె సురేష్‌రెడ్డి, గాలి వీరారెడ్డి, మధు, రవికుమార్‌రెడ్డి, అమరనాధరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అల్లి హుస్సేన్, కిశోర్, మధుగౌడ్, ఫిరోజ్, చైనామాబు, రోబో, కంబగిరి, గౌండా నాగరాజు, హుస్సేన్‌షా, దేవుడు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి 
బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగియుండాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గ కోరారు. ఓటర్లకు తెలియకుండానే కొందరి ఓట్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నందున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలన్నారు. ఓటు హక్కు లేనివారు ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఈ నెల 15లోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కాటసాని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకోవడంలో అజాగ్రత్త వహించవద్దన్నారు.  

మరిన్ని వార్తలు