పండగ వేళ కార్మికులపై శరాఘాతం

8 Oct, 2019 13:57 IST|Sakshi
లే–ఆఫ్‌ జాబితాలో తమ పేర్లు చూసుకుంటున్న కార్మికులు

లే–ఆఫ్‌ ప్రకటించిన కేసీపీ యాజమాన్యం

206 మందిపై ప్రభావం.. 46 మందికి ఉపశమనం  

చల్లపల్లి (అవనిగడ్డ), కృష్ణాజిల్లా : పండగ వేళ కేసీపీ యాజమాన్యం తమ కార్మికులపై శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో 206 మందికి లే–ఆఫ్‌ వర్తింపచేస్తూ ప్రకటించింది. ఈ మేరకు కేసీపీ ఆవరణలోని గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేసింది. కర్మాగారంలో పర్మినెంట్‌ పద్ధతి కింద పని చేస్తున్న 69 మంది కార్మికులు, క్రషింగ్‌ సీజనల్‌ పర్మినెంట్‌ పద్ధతిపై పని చేస్తున్న 137 మంది కార్మికులకు లే–ఆఫ్‌ వర్తింపచేశారు. మరో 46 మంది పర్మినెంట్‌ కార్మికులకు లే–ఆఫ్‌ వర్తింపచేయకుండా ఉపశమనం కల్పించారు.  

సోమవారం నుంచే అమలు..  
పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని సెక్షన్‌ 2 (కేకేకే) ప్రకారం లక్ష్మీపురంలోని కేసీపీ షుగర్స్‌ కర్మాగారంలోని ఉద్యోగులకు ధ్రువీకరించిన స్టాండింగ్‌ ఆర్డర్స్‌ క్లాజ్‌ 7(బి) ప్రకారం సోమవారం నుంచి లే–ఆఫ్‌ ప్రకటిస్తూ బోర్డు ఏర్పాటు చేసింది. లే–ఆఫ్‌ వర్తింపచేయని 46 మంది పరి్మనెంట్‌ కార్మికులను ఉయ్యూరులోని కేసీపీ షుగర్స్‌లో వినియోగించుకోనున్నట్లు తెలిసింది.

నష్టాలు కారణం..  
రెండు సంవత్సరాలుగా చెరకు లభ్యత లేకపోవటంతో కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కేసీపీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా పంచదార నిల్వలు అధికంగా పేరుకుపోవటంతో పాటు, కేసీపీ లక్ష్మీపురం కర్మాగారం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెరకు పరిమాణం ఫ్యాక్టరీ సామర్థ్యాని కంటే చాలా తక్కువగా ఉంటోందని తెలిపింది. దీంతో కర్మాగారంలో క్రషింగ్‌ కొనసాగిస్తే ఆరి్థకంగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంగా తాత్కాలికంగా ఇక్కడి చెరకు పంటను ఉయ్యూరు కర్మాగారానికి తరలించి క్రషింగ్‌ చేయటానికి తీసుకున్న నిర్ణయం అమలులో భాగంగా లక్ష్మీపురం కర్మాగారంలోని కార్మికులకు లే–ఆఫ్‌ వర్తింప చేసినట్లు వివరించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రౌడీషీట్‌ ఎత్తివేయమంటే రూ. 5 లక్షలు అడుగుతున్నారు

పల్నాడు సమగ్రాభివృద్ధికి కృషి

నేడు తెప్పోత్సవం

తోటపల్లికి మహర్దశ..! 

వీరభద్రుని గద్దెకు పోటెత్తిన భక్తులు

‘స్పందన’కు వినతుల వెల్లువ

అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలి 

బడుగుల నెత్తిన పిడుగు

సీఎం సభను విజయవంతం చేయండి 

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం జగన్‌

ఈఎస్‌ఐ ‘డైరెక్టరేట్‌’పై విజిలెన్స్‌ దాడులు 

రయ్.. రయ్.. జెన్‌కో

గాంధేయ పథంలో ఆంధ్రా

కరువు సీమలో ఆనందహేల

తిరుమలలో మరిన్ని సంస్కరణలు

వంకలో ఒరిగిన ఆర్టీసీ బస్సు

కోస్తాంధ్రలో వర్షాలు

ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు

రవిప్రకాశ్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు

జ్యుడీషియల్‌ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణం

రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర

కొత్త కాంతుల దసరా!

తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు

ఈనాటి ముఖ్యాంశాలు

రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ..

15 తర్వాత రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?

ప్రతి రోజూ పుట్టినరోజే