చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేస్తాం

8 Dec, 2019 08:17 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

సాక్షి, ధర్మవరం: చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటరామిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లలో ముంపు బాధితులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. చిన్నకోట్ల, యర్రగుంటపల్లి, మొగిలిచెట్లపల్లి, రాఘవపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ భూములు కోల్పోయినా ఇంకా పరిహారం అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు సంబంధించి ఏఏ సర్వే నంబర్లు ముంపునకు గురయ్యాయో గుర్తించాలని, పరిహారం అందని వారి వివరాలను సేకరించాలని తహసీల్దార్‌ అన్వర్‌హుస్సేన్‌ను అదేశించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోండి 
చిత్రావతి ముంపు బాధితులకు ముదిగుబ్బలో ఇంటి పట్టాలు ఇచ్చారని, అయితే ఆయా పట్టాలను కొందరు దోచుకున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఇంటిపట్టాలు పంపిణీలో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, బాబురెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు