కేజీహెచ్‌లో రోడ్లు జలమయం

21 Jul, 2018 12:00 IST|Sakshi
రక్త పరీక్షల విభాగం వద్ద నీటిలోనే నిలబడ్డ రోగులు, వారి సహాయకులు

తీవ్రంగా ఇబ్బంది పడ్డ రోగులు

పూర్తికాని భూగర్భ డ్రైనేజీ పనులు

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కేజీహెచ్‌ అంతర్గత మార్గాలన్నీ జలమయమై రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎముకల విభాగం, ప్రసూతి విభాగం, ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లే మార్గాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా రక్తపరీక్షలు నిర్వహించే 26వ నంబరు ఆవరణంతా జలమయమైంది. నిల్వ ఉన్న నీళ్లలోనే రోగులు, వారి బంధువులు రక్తపరీక్షల నిర్ధారణ పత్రాల (బ్లడ్‌ రిపోర్ట్స్‌) కోసం నిల్చున్నారు. రోగులు కూర్చునే షెడ్డు కారిపోతుండడంతో తడుస్తూనే వేచి ఉన్నారు.

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
కేజీహెచ్‌లోని అంతర్గత మార్గాలు పూర్తిగా శిథిలమైపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది. అదే విధంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన పనులను జీవీఎంసీ చేపట్టింది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పని పూర్తి కానందున రోడ్లమీద నిలిచిన నీరు బయటకు వెళ్తేందుకు అవకాశం కనిపించడం లేదు. దీంతో వర్షాకాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది తప్పడం లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా