సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం

2 Apr, 2020 18:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు  ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్‌ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కుక్‌ హయాన్‌ షిమ్‌ గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్‌ రూ.5 కోట్ల విరాళం)

రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ
చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. 

మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్‌లు..
కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, విజయకుమార్‌, ప్రద్యుమ్న, ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు.

రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్‌ మంధానీ గ్రూప్‌
కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్‌ తరఫున జీఎల్‌ మంధానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్‌ మంధానీ గ్రూప్‌ ట్రస్టీ బిజయ్‌ మంధానీ ఆన్‌లైన్‌ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు.

మరిన్ని వార్తలు