శేరిలింగంపల్లిలో 6నెలల బాలుడు కిడ్నాప్

27 Nov, 2013 08:46 IST|Sakshi

హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో గత అర్థరాత్రి 6 నెలల బాలుడిని ఆగంతకులు  కిడ్నాప్ చేశారు. దాంతో ఆ బాలుడి తల్లితండ్రులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అందులోభాగంగా తనిఖీలు చేపట్టారు.

బాలుడిని తీసుకుని బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆ బాలుడిని తీసుకుని తల్లితండ్రులకు అప్పగించారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా