దెబ్బతిన్న రెండు కిడ్నీలు

5 Dec, 2018 13:21 IST|Sakshi
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్రీకాంత్‌ శ్రీకాంత్‌ భార్య తేజశ్రీ, కుమారై లీలు

అప్పు చేసి ఇప్పటికే రూ.10 లక్షల ఖర్చు

మరో 20 లక్షలు కావాలన్న డాక్టర్లు

దాతల కోసం ఎదురుచూపు

చిత్తూరు, రొంపిచెర్ల: రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో దాతల సాయం కోసం ఓ సామాన్య వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు..  మండలంలోని బోడిపాటివారిపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లెకు చెం దిన వెంకటనాగులు రెండవ కుమారుడు శ్రీకాంత్‌ (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య తేజశ్రీ, లీలు (11 నెలల పాప) ఉన్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాంత్‌ అనారోగ్యం పాలయ్యాడు.

దీంతో పలు ఆస్పతుల్లో చికిత్సలు చేయించారు. చివరకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలియజేశారు. అప్పటికే సుమారు రూ. 10 లక్షలు అప్పు చేసి చికిత్సలు చేయించినట్లు భార్య తేజశ్రీ తెలిపారు. మరో రూ. 20 లక్షలు ఉంటేగానీ ఏం చేయలేమని డాక్టర్లు తెలిపారని తేజశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. కూలి చేసి జీవనం సాగిస్తున్న తాము అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని బోరున విలపించింది. ప్రస్తుతం తన భర్త స్విమ్స్‌ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. దాతలు స్పందించి కిడ్నీ దానం చేసి ఆదుకోవాలని, లేకుంటే నగదు సాయం చేయాలని ఆమె కోరుతోంది. దాతలు నగదును తేజశ్రీ ఎస్‌బీఐ అకౌంట్‌ నెంబరు 35531788134, ఐఎఫ్‌సీ కోడ్‌ 15894కు బదిలీ చేయాలని ఆమె విన్నవించింది. వివరాల కోసం 88868 36415లో సంప్రదించగలరు.

మరిన్ని వార్తలు