వైఎస్‌ జగన్‌కు వినతుల వెల్లువ

2 Dec, 2018 12:02 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం ఉదయం పది గంటకు కుమ్మర గ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా రాజాం నియోజకవర్గ ప్రజలు జననేతను కలసి తమ గోడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జగన్‌ వద్ద ఏకరువు పెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు చేస్తున్నఇసుక దోపిడిని గురించి వివరించారు.

జిల్లాలోని రేగిడి మండలం అంబకండి గ్రామస్తు తమ గ్రామంలో కిడ్నీ వ్యాధీ తీవ్రత ఎక్కువగా ఉందని, తమకు సురక్షిత తాగునీరు, మెరుగైన వైద్యం సదుపాయాలు అందించాలని కోరారు. జిల్లా చెందిన పాలదరా రాము తనను ఉపాధీ హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరొకవైపు వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.తెలంగాణలో రాష్టంలో కేవలం ఉద్యోగుల ఓట్ల కోసమే చంద్రబాబు హామీలిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో ఇటుక బట్టి కార్మికులు వైఎస్‌ జగన్‌ కలిసి తమ సమస్యలను వెల్లడించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. కరువుల వల్ల భూములను టీడీపీ నాయకులు ఇటుక బట్టీలుగా మార్చేస్తున్నారని, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే అప్పులు చేయల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు