ప్రాణం నిలుపని కిడ్నీ దానం

25 Mar, 2015 04:18 IST|Sakshi
ప్రాణం నిలుపని కిడ్నీ దానం

రెండు కిడ్నీలూ చెడిపోయిన భర్తను బతికించుకోవాలని ఎంతగానో ఆరాటపడి ంది. ఎలాగైనా భర్త ప్రాణాలు కాపాడాలని భావించి తన రెండు కిడ్నీలలో ఒక దానిని భర్తకు ఇచ్చింది. అయినా ఫలితం లేకపోయింది.  భర్త ప్రాణం దక్కలేదు. ఆమె దాతృత్వం ఫలించలేదు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.
 
 లావేరు: మండలంలో ని తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల సూర్యనారాయణ సన్నకారు రైతు. ఉదయం నుంచి పొద్దుపోయేవరకు పొలంపనుల్లో నిమగ్నమయ్యేవాడు. పంటలపై వచ్చిన ఆదాయంతో కుటుం బాన్ని పోషించేవాడు. ఆదర్శరైతుగా పనిచేస్తూ గ్రామస్తులకు పంటల సాగుపై విలువైన సూచనలు అందించేవాడు. అయితే, 2013వ సంవత్సరంలో తరచూ జ్వరం రావడంతో ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించా డు. అక్కడి వైద్యులు పలు వైద్యపరీక్షలు చేసిన అనంతరం రెండు కిడ్నీలు పాడైనట్టు గుర్తించారు. కిడ్నీ అమర్చితే తప్ప బతకడం కష్టమని చెప్పారు. ఎవరైనా కిడ్నీలు దానం చేసేందుకు ముందుకు వస్తే బతికించవచ్చన్నారు.
 
 దీంతో ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేని భార్య సుశీల తన కిడ్నీ భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు సుశీల కిడ్నీ భర్తకు పనికి వస్తుందని నిర్ధారించారు. 2014, ఫిబ్రవరి 14న ఆపరేషన్ చేసి సుశీల కిడ్నీని సూర్యనారాయణకు అమర్చారు. కిడ్నీ అమర్చిన తరువాత కొద్ది రోజులు వరకూ సూర్యనారాయణ ఆరోగ్యం బాగుంది. ఇక పర్వాలేదని, భర్త కోసం భార్య సుశీల చేసిన దాతృత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకపోయింది.
 
 చివరకు సోమవారం(ఈ నెల 23న) తనువు చాలించడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తను, పిల్లలు ఏ పాపం చేశారంటూ రోది స్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మృతునికి భార్యతో పాటు కుమారుడు నవీన్, కుమార్తె సుష్మితలు ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, దన్నాన రాజినాయుడు, దేశెట్టి తిరుపతిరావు, పిల్లా రాములు మంగళవారం సూర్యనారాయణ భార్య, పిల్లలను పరామర్శించారు.
 

మరిన్ని వార్తలు