సీజన్ ఆమెదే

9 Jun, 2014 01:44 IST|Sakshi
సీజన్ ఆమెదే

 సాక్షి ప్రతినిధి, విజయనగరం: నామినేషన్ల ఘట్టం ముగింపు సమయంలో ఆగమనం..చివరి నిమిషంలో దక్కిన టిక్కెట్.. పీసీసీ మాజీ అధ్యక్షుడిపై ఘనవిజయం. అలాగే జిల్లా ప్రజలంతా ఆశ్చర్యపోయేలా చివరి నిమిషంలో వరిం చిన మంత్రి పదవి. రాష్ట్రమంత్రిగా  ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి ఇలా పరి ణామాలన్నీ ఒకదానివెంట ఒకటి కలిసొచ్చాయి. దీంతో ఈ సీజన్ ఆమెకు బాగా కలిసొచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 నామినేషన్ల షెడ్యూల్ వచ్చే వరకు ఆమె విషయం ఎవరికీ తెలియదు. చీపురుపల్లి టీడీపీ ఎంఎల్‌ఏ అభ్యర్థిగా అనేక పేర్లు తెరపైకొచ్చాయి. వారందరినీ అధిగమించి చివరి నిమిషంలో మృణాళిని టీడీపీ అభ్యర్థిగా బరి లోకి దిగారు. స్థానికేతర ముద్రతోనే పోటీ చేసి విజ యం సాధించారు. వాస్తవానికైతే మృణాళిని ఈ జిల్లా వాస్తవ్యురాలే. మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావుకు స్వయానా సోదరి. పొరుగు జిల్లా నేత కిమిడి కళా వెంకటరావు సోదరుడు గణపతిరావు ను వివాహం చేసుకోవడంతో సిక్కోలు వాసి అయ్యారు. ఆ జిల్లాలో రెండు పర్యాయాలు జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
 
 ఆ అనుభవం, బావ కళా వెంకటరావుకున్న లాబీయింగ్ కలిసొచ్చి చీపురుపు ల్లి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కడంతో పాటు విజయం సాధించారు. అదే క్రమంలో మంత్రి పదవి వరిం చింది. సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడ్ని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా కోళ్ల అప్పలనాయుడు రాజకీయ వారసురాలిగా కొనసాగుతున్న లలితకుమారిని కాదని మృణాళినికి మంత్రి పదవి కట్టబెట్టారంటే ఏ స్థాయిలో ప్రభావితం చేయగలి గారో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆమెకు మంత్రి పద వి వరించడానికి విద్యావంతురాలు కావడమే కాకుండా పీసీసీ మాజీ అ ద్యక్షుడు, మాజీ మంత్రి బొత్సపై గెలవడం కూడా ఆమెకు కలిసొచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిం చుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు