క‌రోనా : విరాళాలు ప్ర‌క‌టించిన కంపెనీలు

6 Apr, 2020 18:13 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయ‌ల విరాళం అందించింది. క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డికి సోమ‌వారం కిమ్స్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌  డైరెక్టర్‌ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు చెక్కును అంద‌జేశారు. అలాగే క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం త‌మ వంతు సాయంగా కోటి రూపాయ‌ల విరాళం ఇస్తున్నట్లు శ్రీ చైత‌న్య యాజ‌మాన్యం తెలిపింది. ఈ మేర‌కు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ శ్రీధర్ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి చెక్కును అంద‌జేశారు. 

నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీ  రూ.2.5 కోట్లు విరాళాన్ని అంద‌జేసింది. ఆర్‌టీజీఎస్‌ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి నాట్కో ఫార్మా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ నన్నపనేని విరాళాన్ని అంద‌జేశారు. దీంతో పాటు రూ.1.5 కోట్లు విలువ చేసే మందులు, పర్సన్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ను కూడా అందించారు. ఇక క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కల్లాం గ్రూపు ఆఫ్‌ కంపెనీస్ 25 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి అందించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు