రాజీనామా వార్తలను ఖండించిన సీఎం కిరణ్

12 Jul, 2013 15:28 IST|Sakshi
రాజీనామా వార్తలను ఖండించిన సీఎం కిరణ్

తాను రాజీనామా చేయనున్నట్టు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీఎం కిరణ్ రాజీనామా చేయనున్నారని వార్తా చానళ్లలో వార్తలు వచ్చాయి. అయితే తాను అధిష్టానాన్ని బెదిరించలేదని కిరణ్ స్సష్టం చేశారు. సోనియా గాంధీని ధిక్కరించలేదని చెప్పారు. సోనియా నాయకత్వం పట్ల తనకు పూర్తి విశ్వాసముందన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్టు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

అంతకుముందు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం కిరణ్ కలిశారు. రాష్ట్ర విభజనపై తాను తయారు చేసిన రోడ్ మ్యాప్ ను సోనియాకు ఆయన అందించినట్టు తెలిసింది. సోనియాతో భేటీకి ముందు ఆయన సీమాంధ్ర ప్రతినిధులో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని సోనియాకు సీఎం చెప్పినట్టు సమాచారం. మరోవైపు కోర్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు