అభయ ఘటనపై సీఎం సమీక్ష

25 Oct, 2013 16:26 IST|Sakshi

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర అత్యాచారానికి గురైన 'అభయ' ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రసాదరావుతో పాటు పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచి రాత్రి వేళల్లో కూడా తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ చెప్పారు. ఐటీ ఉద్యోగులు వీలైనంతవరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఒంటరిగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కిడ్నాప్ చేసి అత్యచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఇదిలావుండగా ఆర్టీసీ నిర్వహణ భారం పెరిగిందని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఆర్టీసీ 900 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు