విశాఖ ఏజెన్సీలో విదేశీ పంట!

31 May, 2014 00:44 IST|Sakshi
విశాఖ ఏజెన్సీలో విదేశీ పంట!
  •      కివి పంట సాగుకు అనుకూలం
  •      సీసీఎండీ శాస్త్రవేత్తల ప్రణాళికలు
  •  చింతపల్లి, న్యూస్‌లైన్ : విశాఖ మన్యానికి మరో అతిథి పంట రాబోతుంది. విదేశాలలో శీతల వాతావరణంలో పం డే కివి మొక్కలను చింతపల్లి మండలం లో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు సీసీఎండీ శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. వచ్చే ఏడా ది జనవరిలో లంబసింగి, చింతపల్లి ప్రాంతాలలో కివిని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు చర్యలు చేపడుతున్నా రు.

    ఇప్పటికే యాపిల్ సాగును ఇక్కడ ప్రారంభించారు. మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. యాపిల్‌సాగుపై ఆశలు చి గురిస్తున్న తరుణంలో సీసీఎండీ శాస్త్రవేత్తలు మరో అతిథి పంటకు శ్రీకారం చు డుతున్నారు. ఈ పంటల సాగుకు ఇక్కడ వాతావరణం అనుకూలిస్తే కాఫీ సాగులో రాష్ట్రంలోనే తలమానికంగా నిలిచిన విశా ఖ మన్యం మరో కీర్తిశిఖరాన్ని చేరుకుం టుంది.

    చైనాలో పుట్టిని కివి పంటను ఆ స్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇటలీ వంటి దేశాలలో వాణిజ్యపరంగా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ఎన్నో ఔష ధ గుణాలు కలిగిన కివి పండ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. విట మిన్ డి, ఈ, కేలతో పాటు ఖనిజ లవణాలు, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6, వేసవిలో గరిష్టంగా 34 డిగ్రీలకు మించని అటవీ ప్రాంతాలు ఈ కివి పంట సాగుకు అనుకూలంగా ఉం టాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనదేశంలో జమ్మూకాశ్మీర్ పరిశోధ స్థానం ఆధ్వర్యంలో మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తది తర ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా కివి ని సాగు చేస్తున్నారు. కేరళ, హిమాచల్ ప్ర దేశ్‌లలోని ఉద్యాన పరిశోధన కేంద్రాలు సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.

    మొక్కలను నాటి న 4 లేదా 5 ఏళ్లకు దిగుబడులు ప్రారంభమై ఏడెనిమిదేళ్లకు పూర్తిస్థాయిలో ఫల సాయం ఇస్తాయని శాస్త్రవేత్తలు తెలిపా రు. గత ఏడాది డిసెంబరులో యాపిల్ సాగుకోసం చింతపల్లి, లంబసింగి ప్రాం తాల్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన సీసీఎండీ శాస్త్రవేత్త డాక్టర్ వీరభద్రరావు కివిని ప్రయోగాత్మకంగా సాగు చేయాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి మొ క్కలను దిగుమతి చేసుకుని ప్రతి ఏడాది జనవరి నుంచి సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.

మరిన్ని వార్తలు