నాలెడ్జ్ హబ్‌గా ఏపీ : గంటా

11 Oct, 2014 00:49 IST|Sakshi

రాంబిల్లి: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాంబిల్లిలో కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సం స్కరణలు తీసుకువస్తామని చెప్పారు. కస్తూ ర్బా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి 17 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఎంపీ ము త్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పోటీతత్వంతో విద్యార్థులు చదవాలని సూచించారు. కాగా, కస్తూర్బా భవన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నట్లు కన్నబాబు సభలో మంత్రి గంటా, ఎమ్మెల్యే పంచకర్ల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు సరిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీపీ వసంతవాడ వెంకటేశ్వరరావు, సర్పం చ్ పిన్నంరాజు రాధాసుందర సుబ్బరాజు (కిషోర్), డీఈఓ కృష్ణారెడ్డి, సర్వశిక్ష అభియాన్ పీఓ బి.నగేష్, మండల ప్రత్యేకాధికారి పి.కోటేశ్వరరావు, తహశీల్దార్ మల్లేశ్వరరావు, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
 
నియోజకవర్గానికి ఓ జూనియర్ కళాశాల

అచ్యుతాపురం: నియోజకవర్గానికి ఓ జూని యర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రామన్నపాలెంలో సుజలస్రవంతి పథకాన్ని ప్రారంభించారు. అచ్యుతాపురం కూడలిలో రోడ్లు ఊడ్చారు. మోసయ్యపేట గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. అనంతరం దిబ్బపాలెం ఎస్‌ఈజెడ్ కాలనీ జన్మభూమి సభలో మాట్లాడారు.

ఎస్‌ఈజెడ్ సమస్యలపై అధ్యయనం చేశామని, నిర్వాసితులకు నైపుణ్యం లేనికారణంగా ఉపాధికి దూరమవుతున్నారని చెప్పారు. నిర్వాసితుల న్యా యమైన కోర్కెలు పరిష్కరిస్తామని చెప్పారు. అచ్యుతాపురంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు