నాలెడ్జ్‌ సొసైటీ నా విజన్‌

17 Dec, 2017 01:49 IST|Sakshi

టెక్‌–2017 సదస్సులో సీఎం చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ సొసైటీగా తయారు చేయాలన్నదే తన విజన్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగే ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ  సదస్సును శనివారం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే శనివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన హెలీ టూరిజంను సీఎం ప్రారంభించారు. కాగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–వీసా సదుపాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. బాబు ఆదివారం మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. మళ్లీ ఈ నెల 23వ తేదీన ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తారు. 

మరిన్ని వార్తలు