'గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు'

1 Mar, 2020 13:01 IST|Sakshi

సాక్షి, గుడివాడ : గుడివాడ చరిత్రలో ఈరోజును ఒక గొప్ప రోజుగా గుర్తుంచుకుంటామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని లింగ వరం రోడ్డు లోని కె కాన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కొడాలి మాట్లాడుతూ.. ఎందరో ప్రముఖుల పురిటిగడ్డ ఈ గుడివాడ అని, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం తలుపు తట్టే న్యాయ వ్యవస్థ ప్రాంతంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బట్టు దేవానంద్ గుడివాడ నుంచి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టమని తెలిపారు. సమాజంలో అనేక అసమానతలు తొలిగేలా అంబేద్కర్ ఆశయాలను దేవానంద్ నెరవేర్చుతాని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు,దర్శకుడు, నిర్మాత వైవీయస్ చౌదరి యూనేటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గుమ్మడి రవీంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.(‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం) 

సినీ దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ' గుడివాడలొనే  నా విద్యాబ్యాసమంతా కొనసాగింది. నాకు సినిమా రంగంలో స్పూర్తి ఎన్టీఆర్‌. ఆయన స్పూర్తితోనే నేను సినిమా రంగంలోకి వెళ్ళాను. జీవితంలో ప్రతి ఒక్కరు..నువ్వు అనే పిలుపు నుంచి మీరు అని పిలిపించుకుని స్థాయికి చేరాలి. బట్టు దేవానంద్ నా చిన్ననాటి  సహా విద్యార్థి. కానీ నేడు బట్టు దేవానంద్‌ను మీరు అని పిలిపించుకోవడం మన ప్రాంతం అదృష్టం. మత సామరస్యనికి నిలయం గుడివాడ.విద్యార్థి దశ నుంచే సమయ స్పూర్తి తో నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి బట్టు దేవానంద్' అంటూ తెలిపారు. 

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. 'పేద కుటుంబ నుంచి వచ్చి వ్యక్తి  ఉన్నత స్థాయికి రావడం సాదరణ విషయం కాదు. స్వాతంత్రం అనంతరం గుడివాడలో ఒక దళితుడు కూడా హైకోర్టు జడ్జి కాలేదు. నేటి రోజుల్లో పేదవారు పైకి రావడం చాలా కష్టం. పేదవారు కూడా ఉన్నత స్థాయికి రావాలన్నదే నా ఉద్దేశం. చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇవ్వాలని నేను దేవానంద్‌ను కోరుతున్నాను. బట్టు దేవానంద్ సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి చేరాలని ఆశిస్తున్నా' అంటూ వెల్లడించారు.

మరిన్ని వార్తలు