మంగళగిరి కోర్టుకు కోడెల శివరాం

9 Oct, 2019 14:19 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన నేడు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై శివరాం లాయర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ.. ‘శివరాంకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. అందుకు సంబంధించిన షూరిటీలను ఆయన మంగళగిరి కోర్టుకు అందజేశారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంద’ని తెలిపారు. 

తన తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా వ్యవహరించిన కాలంలో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌.. శివరాంకు చెందిన షోరూమ్‌లో లభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శివరాంపై సెక్షన్‌ 409, 411 ల కింద కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు