కొంగు బిగించి...

29 Jan, 2014 04:25 IST|Sakshi

లోవోల్టేజీ వారికి నీరు లేకుండా చేస్తోంది. దీనితో కంటి మీద కునుకు లేదు. ఇంట్లో నీరు లేదు. కొంగు బిగించారు. అంతా చలో మహబూబ్‌నగర్ అంటూ ‘విద్యుత్తు భవన్’కు వచ్చి చుట్టుముట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హఠం చేశారు. విద్యుత్తు డీఈ (టెక్నికల్) నీలాదేవి కాళ్లూ పట్టుకున్నారు. చివరికి ఎస్.ఇ. సదాశివరెడ్డి వచ్చే ట్రాన్స్‌ఫార్మర్ తీసుకెళ్లమని చెప్పడంతో పంతం వీడారు. ఇదీ జడ్చర్ల మండలం కుర్వపడ్డి పల్లె మహిళలు చూపిన తెగువ. పని సాధించుకున్న తీరు.
 -విద్యుత్ భవన్ ముట్టడి
 
 మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ఓ వర్‌లోడ్‌తో నాలుగు నెలలుగా బోరుమోటారు పనిచేయడం లేదని, తాగునీటి కో సం ఇబ్బందులు పడుతున్నా ఎవరూ ప ట్టించుకోవడం లేదని జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లికి చెందిన సుమారు వందమంది మహిళలు మంగళవారం స్థానిక విద్యుత్‌భవన్‌ను ముట్టడించారు. ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై 24 వ్యవసాయ మోటా ర్లు, తాగనీటి పథకం కనెక్షన్లు ఉండటం తో లోఓల్టేజీ అధికమై తాగునీటి ఎద్దడి నెలకొందని, నీళ్లులేక రబీ పంటలు ఎం డుతున్నాయని వాపోయారు.
 
 ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే బైరంపల్లి గ్రామ రైతులు రెండు ట్రాక్టర్లలో వచ్చి ఎస్‌ఈ కార్యాల యం ఎదుట బైఠాయించారు. విద్యుత్‌శా ఖ ఎస్‌ఈ సదాశివారెడ్డి వచ్చే వరకు ఇక్క డి నుంచి కదిలేదని భీష్మించుకూర్చున్నా రు. వారిని పట్టించుకోకుండా వెళ్తున్న టెక్నికల్ డీఈ నీలాదేవిని రైతులు అడ్డుకున్నారు. ఆ మహిళలు చాంబర్‌లోకి దూ సుకుపోయి తమ గోడును వెలిబుచ్చారు. ఈ విషయం తనకు సంబంధం లేదని, తన విధులకు అడ్డుతగిలితే చర్యలు తీసుకుంటానని బెదిరించినప్పటికీ వారు అ క్కడే బైఠాయించారు.
 
 ఎస్‌ఈ వచ్చేవరకు చాంబర్‌లోనే ఉంటామని, లేదా అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇచ్చేవరకు కదలబోమని బీష్మించుకూర్చున్నారు. ఇంత లోకొందరు మహిళలు కరెంట్ సమస్య ను పరిష్కరించమని కోరుతూ ్డ్డటెక్నికల్ డీఈ నీలాదేవి కాళ్లపైపడ్డారు. చివరికి విషయం తెలుసుకున్న ఎస్‌ఈ సదాశివారెడ్డి బుధవారం సంబంధిత ఏఈని తీసుకొచ్చి ట్రాన్స్‌ఫార్మర్ తీసుకెళ్లమని చెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా మండల అధ్యక్ష, కార్యదర్శులు శౌరి, శ్యాంసుందర్‌రెడ్డి, మహిళలు జంగమ్మ, పుష్పలత, లక్షి్ష్మదేవి, అలివేలు, జయమ్మ, మంత మ్మ, శ్యా మలమ్మతో పాటు మహిళలు, రైతులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు