కర్నూల్ రాజధాని కావాలి: కోట్ల

27 Feb, 2014 20:40 IST|Sakshi
కర్నూల్ రాజధాని కావాలి: కోట్ల

హైదరాబాద్: సీమాంధ్ర కోసం కర్నూలును రాజధానిగా చేయాలని  పోరాడనున్నట్లు  రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌రెడ్డి  చెప్పారు. డబుల్ డెక్కర్ రైలును పరిశీలించేందుకు గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయానికి గురైన రాయలసీమకు రాజధాని  ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే సహా  అన్ని అంశాలపై  కమిటీలు వే శారని, ఆ కమిటీ నివేదిక మేరకు రైల్వేలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.

రాయలసీమకు చెందిన వ్యక్తిగా సీమాంధ్ర రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కర్నూల్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వాల్తేరు డివిజన్ విలీనం పైన కూడా కమిటీ నివేదిక మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఇంకా భూమి లభించలేదన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలోనే  ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు