‘ఏకగ్రీవమే..!

12 Dec, 2013 04:35 IST|Sakshi
‘ఏకగ్రీవమే..!

వంగర, న్యూస్‌లైన్: ఉత్కంఠ నెలకొన్నా.. కొట్టిశ మత్స్యకార సొసైటీ ఎన్నిక ప్రశాం తం గా జరిగింది. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొసమెరుపు. ఓ వర్గం చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది.కొట్టిశలోని శ్రీ సీతారామ ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాచర్ల దివాకరరావు ఆధ్వర్యంలో తొమ్మిది మంది డెరైక్టర్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఎన్నిక సాఫీగా సాగిపోయా యి. తొలుత తొమ్మిది స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో ఒకరు  ఉపసంహరించుకున్నారు. మిగిలిన 17 మందిలో ఒక వర్గానికి చెందిన తొమ్మిది మంది, మరో వర్గానికి చెందిన ఎనిమిది బరిలో నిలిచారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎన్నికల కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో బరిలో నిలిచిన తొమ్మిది  మందికి గాను 8 మంది అభ్యర్థులను..చేతులెత్తే పద్ధతిన సభ్యులు ఎన్నుకున్నారు.
 
 కాస్త అయోమయం
 వంగర డెరైక్టర్ ఎన్నిక సమయంలో గ్రామస్తుల మధ్య కొంతసేపు అయోమయం నెలకొంది. తమ పేరేప్రతిపాదించాలంటూ..ఇద్దరు వ్యక్తులు ముందుకు రావడంతో..కాస్త ఇ బ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో గ్రామస్తులంతా..ఒకే చోట కూర్చుని..అభ్యర్థిని నిర్ణయిం చుకోవడంతో  సమస్య పరిష్కార మైంది. అయితే..ఆ డెరైక్టర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. 574 మంది ఓటర్లున్న ఈ సంఘంలో తొలుత ఎన్నికల్లో పాల్గొనేందుకు 329 మంది పేర్లు నమోదు చేసుకోగా..వారిలో 287 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు.
 
 నూతన డెరైక్టర్లు వీరే...
 అధ్యక్షునిగా పెనుబోతు దుర్గారావు ఎన్నికయ్యారు. డెరైక్టర్లుగా మురగడాపు పోలిపల్లిదొర(పటువర్థనం), తాటిగూడ రామారావు(కొట్టిశ), పిల్లి సంజీవి(మరువాడ), బొండపల్లి సింహాచలం(గీతనాపల్లి), గుడివాడ సూరందొర(శ్రీహరిపురం) వంటల భూపతిదొర(కొండచాకరాపల్లి), సూరుమల్లి గురువులు(మగ్గూరు)లను ఏకగ్రీవంగా చేతులెత్తే పద్ధతి  ద్వారా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది గోపీకృష్ణ, శాంతారావు, నాగరాజు, రాజాం, కొత్తూరు సీఐలు శ్రీనివాస చక్రవర్తి, ఎన్.సాయి, వంగర, సంతకవిటి, జి.సిగడాం ఎస్సైలు అప్పలరాజు, భీమారావు, తులసీరావులతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లుకు చెందిన 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 
 ఫొటో: 11 ఆర్‌జెయం 61 చేతులెత్తి డెరైక్టర్లు,అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న మత్స్యకార సంఘ సభ్యులు
 ఫొటో: 11 ఆర్‌జెయం 61(ఎ)(బి):  పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు
 ఫొటో: 11 ఆర్‌జెయం 61(సి) పెనుబోతు దుర్గారావు
 

మరిన్ని వార్తలు