కడియం చెప్పినా... బాబు కేబినెట్ స్పందించ లేదు

20 May, 2015 12:30 IST|Sakshi
కడియం చెప్పినా... బాబు కేబినెట్ స్పందించ లేదు

విశాఖపట్నం: వరంగల్ నిట్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పినా...ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కేబినెట్ స్పందించకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కొయ్యప్రసాదరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. నిట్ అంశంపై ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు పెంచి... ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.

బీ,సీ కేటగిరి సీట్లకు మళ్లీ ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టడం ద్వారా మరో అవినీతికి తెరలేపారన్నారు. ఆంధ్రయూనివర్శిటీ చితికిపోయేలా ప్రైవేట్ యూనివర్శిటీలకు లబ్ది చేకూరేలా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు,ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, కామినేని, నారాయణ వ్యవహరించడం దుర్మార్గమని కొయ్య ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. డబ్బున్నవారికే సీట్లు ఇచ్చేలా ఏపీ విద్యావిధానం ఉందని కొయ్య ప్రసాదరెడ్డి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు