బాబు అవినీతి.. తెలుగువారికి సిగ్గుచేటు

2 Jun, 2015 16:22 IST|Sakshi
బాబు అవినీతి.. తెలుగువారికి సిగ్గుచేటు

విశాఖపట్నం: చంద్రబాబు తన అవినీతితో ప్రపంచంలో తెలుగువారంతా సిగ్గుతో తల వంచుకునేలా చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో చంద్రబాబు ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్ష.. ధనదాహ దీక్ష అంటూ మండిపడ్డారు.

ఏడాదికి 10 వేల కోట్లు సంపాదించి.. తన కొడుక్కి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని కొయ్య ప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు