'ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి'

22 Aug, 2017 12:36 IST|Sakshi
విజయవాడ: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కిందకు తీసుకురావాలని ఏపీ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, నాగార్జునసాగర్ కుడి, ఎడమ ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు భుజంగరాయలు, వై. పుల్లయ్య చౌదరిలు కోరారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో జరుగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశానికి విచ్చేసిన బోర్డు చైర్మన్‌ శ్రీవాస్తవను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సిన నీటిని సకాలంలో విడుదల చేయించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
 
సాగర్ కుడి కాలువ ప్రధాన రెగ్యులేటర్ గుంటూరులో ఉన్నందున దాని నిర్వహణను ఏపీకి అప్పగించాలని కోరారు. ఏపీలో తొలిసారిగా చైర్మన్‌ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలపై చర్చ జరుగుతోంది. సమావేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బోర్డు చైర్మన్‌ శ్రీవాస్తవను కలిశారు. 
మరిన్ని వార్తలు