నేటి నుంచి కృష్ణా డెల్టాకు నీరు

20 Jul, 2014 02:25 IST|Sakshi
నేటి నుంచి కృష్ణా డెల్టాకు నీరు

విజయవాడ బ్యూరో: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం ఆదివారం ఉదయం నుంచి మూడో విడత నీటిని విడుదల చేయాలని ఇంజనీర్‌ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ  చేశారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు 2.88 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయనున్నారు. ఈ నీటిని కేవలం తాగు నీటి అవసరాలకే వినియోగించుకోవాలని ఏపీ  ప్రభుత్వం కృష్ణాడెల్టా అధికారులకు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా...మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర రిజర్వాయర్లకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఆల్మట్టిలో శనివారం సాయంత్రం 50,328 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, ఆదివారం ఇన్‌ఫ్లో 52,063గా ఉంది. తుంగభద్ర డ్యాంకు ఆదివారం ఉదయానికి 42,726 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల రిజర్వాయర్‌కు 250 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జూరాల, నారాయణపూర్, శ్రీశైలం రిజర్వాయర్లు నిండి నాగార్జునసాగర్ జలాశయానికి నీరు చేరాలంటే భారీ వర్షాలు పడాల్సిందే.
 

మరిన్ని వార్తలు