ఏడోసారి వరద

22 Oct, 2019 03:51 IST|Sakshi

ఇదివరకెన్నడూ లేని విధంగా శ్రీశైలానికి ఈ సీజన్‌లో కృష్ణమ్మ పరవళ్లు

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో ఉరకలెత్తుతున్న ప్రవాహం

ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల్లోంచి నీటి విడుదల

తుంగభద్రకూ పెరిగిన వరద.. భీమాలోనూ స్థిరంగా ప్రవాహం

నేడు శ్రీశైలంలోకి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం

సాక్షి, అమరావతి: ఈ సీజన్‌లో శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం ఏడోసారి తరలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో కృష్ణా వరద ప్రవాహం ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి భారీ ఎత్తున చేరుతోంది. ప్రధాన ఉపనది తుంగభద్రలోనూ వరద ప్రవాహం పెరిగింది. భీమాలోనూ వరద ఉద్ధృతమైంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర జలాశయాల్లోకి వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం శ్రీశైలం జలాశయంలోకి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వరద ప్రవాహం నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలో 57 వేల క్యూసెక్కులు వస్తుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 77 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 209.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ తరుణంలో తాజాగా ఏడో దఫా శ్రీశైలంలోకి వరద ప్రవాహం వస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ సీజన్‌లో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీశైలంలోకి 1,415.84 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. పుష్కర కాలం తర్వాత శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం.

గోదావరి, వంశధారలో స్థిరంగా వరద 
గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 82,797 క్యూసెక్కుల గోదావరి ప్రవాహం వస్తుండగా అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 6,151 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో బంగాళాఖాతంలోకి వదులుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

వడ్డీల కోసం.. అప్పులు

బోటు ముందుకు.. శకలాలు బయటకు 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

అర్చకుల కల సాకారం

విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు

‘చంద్రబాబు సంస్కారహీనుడు’

మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి అంత బాధ ఎందుకో..?

10 రోజులు డెడ్‌లైన్‌ పెట్టాం: మంత్రి సురేష్‌

ఈనాటి ముఖ్యాంశాలు

గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు

అత్తింటి వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు

‘అందుకే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడు’

రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..

24న సూరంపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

హోంగార్డులకు రూ.40 లక్షల బీమా

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొడాలి నాని

కోర్టు కష్టాలు

పోలీసుల క్యాండిల్‌ ర్యాలీ

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాలినేని

కుప్పకూలిన భవనం

కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా అనిల్‌కుమార్‌ 

జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి పేర్ని నాని

తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం క్షమించదు

కళాశాలల్లో ‘నిషా పెన్‌’ !

టెక్నాలజీని వాడుకోండి: అవంతి

ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

రివర్స్‌ టెండరింగ్‌ గ్రాండ్‌ సక్సెస్‌: మంత్రి అనిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం

మనిషిలో మరో కోణం

కేవలం మీకోసం చేయండి

ఫైనల్‌కొచ్చేశారు

‘మా’ కి ఆమోదం తెలపండి

‘మా’ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం