245 నామినేషన్లకు ఆమోదం

27 Mar, 2019 13:34 IST|Sakshi
నామినేషన్లను పరిశీలిస్తున్న విజయవాడ పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృతికాశుక్లా

సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు, నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు, వారి అనుచరుల సమక్షంలో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా అభ్యర్థి ఓటు.. ప్రపోజర్‌ ఓటు పరిశీలనతో పాటు నామినేషన్‌ పత్రాన్ని పూర్తిస్థాయిలో రాసినదీ, లేనిదీ, పార్టీల ఆమోదపత్రాలు తదితర అంశాలను పరిశీలించి అనంతరం వాటిని ఆమోదించారు. అలాగే ఒక పార్టీ అభ్యర్థి, వేరొక పార్టీ అభ్యర్థి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని రిటర్నింగ్‌ అధికారులు ఆయా పార్టీల నాయకులకు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 332 మంది అభ్యర్థులు నామినేషన్లు పరిశీలించగా 245 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. 87 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు అభ్యంతరాలు తెలపటంతో నామినేషన్ల పరిశీలన కార్యక్రామాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. నామినేషన్లు ఆమోదించిన అనంతరం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ప్రధాన పార్టీలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

♦ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బండ్రెడ్డి రామకృష్ణ (రాము) తో పాటు మరో 11 మంది నామినేషన్లను ఆమోదించారు. నలుగురి నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.
♦ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వీరప్రసాద్‌ (పీవీపీ), టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్‌ (నాని), జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్‌బాబు తో పాటు మరో 12 నామినేషన్లను ఆమోదించారు. ఆరుగురు నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు. 
♦ తిరువూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి, టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి శామ్యూల్‌జవహార్‌ తో పాటు 10 నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. ఏడుగురివి తిరస్కరించారు.
♦ నూజివీడులో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, టీడీపీ అభ్యర్థిగా ముదరబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బసవ భాస్కరరావుతో పాటు మరో తొమ్మిది నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. మూడింటిని తిరస్కరించారు.
♦ గన్నవరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌ తో పాటు మరో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రెండు నామినేషన్‌ పత్రాలకు ఆమోదం లభించలేదు.
♦ కైకలూరులో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణతో పాటు మరో 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించగా.. మరో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
♦ పెడనలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీశ్రీనివాస్‌లతో పాటు 14 నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. మరో మూడు నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.
♦ మచిలీపట్నంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన అభ్యర్థి బండి రామకృష్ణతో పాటు ఆరు నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. మూడు నామినేషన్లను తిరస్కరించారు.
♦ అవనిగడ్డలో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్, టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణారావుతో పాటు పది నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 
♦ పామర్రులో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా ఉప్పులేటి  కల్పనతో పాటు 11 నామినేషన్‌ పత్రాలను ఆమోదం లభించగా.. ఐదు నామినేషన్లను తిరస్కరించారు.
♦ విజయవాడ వెస్ట్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా షబనాముస్తరాత్‌కాతూన్, జనసేన అభ్యర్థిగా పోతిన వెంకటమహేష్‌తో పాటు 25 నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేన్లను తిరస్కరించారు.
♦ విజయవాడ సెంట్రల్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణువర్థన్, టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావుతో పాటు మరో 17 నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.
♦ విజయవాడ ఈస్ట్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బొప్పన భవకుమార్, టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌తో పాటు పది నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. 17 నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.
♦ మైలవరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేనఅభ్యర్థిగా అక్కల రామ్మోహనరావుతో పాటు మరో 17 నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.
♦  నందిగామలో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా మొండితోక జగన్‌మోహన్, టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్యతో పాటు తొమ్మిది నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. మరో ఐదు తిరస్కరణకు గురయ్యాయి.
♦ జగ్గయ్యపేటలో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను, టీడీపీ అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య)తో పాటు పది నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు. మరో ఎనిమిది నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు.

మరిన్ని వార్తలు