ప్రతిష్టాత్మకంగా కృష్ణ పుష్కరాలు

29 Apr, 2016 04:56 IST|Sakshi
ప్రతిష్టాత్మకంగా కృష్ణ పుష్కరాలు

రూ.180 కోట్లతో 587 ఆలయూల్లో ఏర్పాట్లు
తిరుపతిలో అంతర్జాతీయు హిందూ సమ్మేళనం
విలేకర్ల సవూవేశంలో దేవాదాయు శాఖ మంత్రి మాణిక్యాలరావు

 
శ్రీకాళహస్తి : ఈ యేడాది ఆగస్టులో జరగనున్న కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు  రాష్ట్ర దేవాదాయు శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయున విలేకర్లతో వూట్లాడారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని 587 ఆలయూల్లో కృష్ణా పుష్కరాలను శోభాయువూనంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయున వెల్లడించారు. అలాగే టీటీడీ సారథ్యంలో త్వరలో తిరుపతిలో అంతర్జాతీయు హిందూసమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయూలను ఇనువుడింజేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశ దిశలా వ్యాంపించే విధంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తావున్నారు.

విదేశా ల్లో ఉన్న వైష్ణవాలయూల్లో జరిగే ఉత్సవాలకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, శైవాలయూలకు శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాలనుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, అవ్మువారి ఆలయూలకు విజయువాడ కనకదుర్గవ్ము ఆలయుం నుంచి తీర్థ ప్రసాదాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయున వివరించారు.

ఇక కృష్ణా పుష్కరాలలో గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు వుుందస్తుగానే చేపడుతున్నట్లు ఆయున పేర్కొన్నారు. ఈ కార్యక్రవుంలో శ్రీకాళహస్తి దేవస్థానం వూజీ చైర్మన్, బీజేపీ నేత కోలా ఆనంద్, నాయుకులు అరవింద్‌రెడ్డి, పగడాల రాజు, సుబ్రవుణ్యంరెడ్డి, రవీంద్రబాబు, గరికపాటి రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు