కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

27 Mar, 2015 11:46 IST|Sakshi
కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును  ఏప్రిల్ 29 వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని  సూచించింది. అయితే గెజిట్ లో తమ  వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా