బిరబిరా కృష్ణమ్మ

31 Jul, 2013 05:29 IST|Sakshi

 శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీసింది. మంగళవారం మధ్యాహ్నం నీటిపారుదలశాఖ సీఈ సీహెచ్ కష్ణారావు, ఎస్‌ఈ పురుషోత్తమరాజు, ఈఈ జగదీశ్వరరావు, దేవస్థానం ఈఓ చంద్రశేఖరఅజాద్ కష్ణమ్మకు వాయినాన్ని సమర్పించారు. శ్రీశైలదేవస్థానం అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం డ్యామ్ నాలుగు రేడియల్ క్రస్ట్‌గేట్లు తెరిచి సాగర్‌కు నీరు విడుదల చేశారు. డ్యామ్ నుంచి నీటి విడుదల దశ్యాల చూసేందుకు పర్యాటకులు బారులుదీరారు. పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.
 
 ఈ ఏడాది వర్షాకాలంలో సెల్ఫ్‌క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఊహించినంత వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ, ఎగువ పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైల జలాశయానికి గత 22వ తేదీ నుంచి భారీగా నీరు వచ్చి చేరింది. గరిష్టస్థాయికి చేరువలో జలాశయం ఉండడంతో విద్యుత్ ఉత్పాదన ద్వారానే కాకుండా  రేడియల్ క్రస్ట్‌గేట్లను  10 అడుగుల మేర తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన ఏడాది జూలై 14న రివర్స్‌స్లూయిస్ గేట్లను  తెరచి అదే నెల  26వతేదీమూసివేశారు. ఈ ఏడాది కూడా జూలై నెలాఖరులో నీటిని విడుదల చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మరో రెండు గేట్లను తెరిచి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. గేట్ల ఆపరేషన్‌లో డీఈ సేనానంద్, అటవీశాఖ ఏసీఎఫ్ ఖాదర్‌వల్లి, డ్యాం ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు