నడిచి వెళ్లేవారి సంఖ్య తగ్గింది

18 May, 2020 04:13 IST|Sakshi

మొత్తం 4,661 మందిని రిలీఫ్‌ సెంటర్లకు తరలించాం

మీడియా సమావేశంలో కోవిడ్‌ టాస్క్‌ఫోర్సు చైర్మన్‌ కృష్ణబాబు

సాక్షి, అమరావతి: మూడ్రోజులుగా రాష్ట్రం మీదుగా నడిచి వెళ్లే వలస కూలీల సంఖ్య తగ్గిపోయిందని కోవిడ్‌ టాస్క్‌ఫోర్సు చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. మొత్తం నడిచి వెళ్లే 4,661 మంది వలస కూలీలను చెక్‌పోస్టుల వద్ద ఆపి వారికి కౌన్సెలింగ్‌ చేసి 62 రిలీఫ్‌ సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో పంపించామన్నారు.  వీరిలో మన రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన వారు కేవలం 485 మంది మాత్రమే ఉన్నారని.. మిగిలిన 4,176 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారన్నారు. ఒడిశా సీఎస్‌తో మాట్లాడి ఆ రాష్ట్రానికి చెందిన వారిని గంజాం జిల్లాలో వదిలేందుకు ఏర్పాట్లుచేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆయన  మీడియాతో మాట్లాడారు. 

► శ్రామిక్‌ రైళ్లలో వలస కూలీలకు రెండు లేదా మూడు బోగీలు కేటాయిస్తున్నాం. 
► ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల నుంచి బస్సుల్లో 902 మందిని ఒడిశాలోని గంజాంకు చేర్చాం. మరో వెయ్యి మందికి పైగా శ్రామిక్‌ రైళ్లలో వివిధ రాష్ట్రాలకు పంపుతున్నాం. 
► జార్ఖండ్‌కు ఐదు, పశ్చిమ బెంగాల్, యూపీ వెళ్లేందుకు ఆరు, ఒడిశా, రాజస్థాన్‌లకు రెండు, బీహార్‌కు మూడు శ్రామిక్‌ రైళ్లను నడపాలని నిర్ణయించాం. 
► సోమవారం కూడా ఐదు రైళ్లు పంపించేందుకు నిర్ణయించాం. 
► ఇప్పటివరకు 31 రైళ్లలో మొత్తం 36,823 మందిని వారివారి రాష్ట్రాలకు పంపించాం. వారికయ్యే ఖర్చు మన రాష్ట్రమే భరిస్తుంది. 
► అలాగే, ఏపీకి చెందిన 1,09,742 మంది వలస కూలీలను వారి వారి జిల్లాలకు పంపించాం. 
► ఇక కువైట్‌లో చిక్కుకుపోయిన 2,500 మంది ని రప్పించేందుకు సీఎం విదేశాంగ శాఖకు లేఖ రాయడంతో అక్కడ నుంచి విమానాలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి ఫ్రీ క్వారంటైన్‌ సదుపాయం కల్పిస్తాం.  

మరిన్ని వార్తలు