నటుడు కృష్ణంరాజు అసహనం

7 Oct, 2019 10:54 IST|Sakshi
క్యూలైన్‌లో వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు

ఇంద్రీకలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి అధికారుల తీరుపై మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా దర్శించుకునేందుకు కృష్ణంరాజు ఆదివారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఘాట్‌ రోడ్డు మీదగా కొండపైకి విచ్చేసిన కృష్ణంరాజు కుటుంబం కుంకుమార్చనలో పాల్గొనాలని పోలీసు సిబ్బందిని అడిగింది. అయితే సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కృష్ణంరాజు, అతని కుటుంబం ఈవో కార్యాలయం పక్కనే ఉన్న క్యూలైన్‌లో నుంచి కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.

క్యూలైన్‌లో వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు 
సాధారణ భక్తులతో పాటు అష్టకష్టాలు పడుతూ  మెట్లు దిగి ఆరో అంతస్తుకు చేరుకున్నారు. మార్గంలో పలుచోట్ల కృష్ణంరాజు ఆయాస పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం నడవలేనని చెప్పినా ఆలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడైన కృష్ణంరాజును పట్టించుకోకపోవడం సరికాదని పలువురు భక్తులు పేర్కొన్నారు. అనంతరం విశేష కుంకుమార్చనలో పాల్గొన్న  కృష్ణంరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుంది. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

15 తర్వాత రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి

వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్‌!

పైరవీలు చేసేవారిని దూరం పెట్టండి..

దళితుడి పై దాడి కేసులో చింతమనేని అరెస్ట్‌

ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు

దసరా ఎఫెక్ట్‌.. విమానాలకూ పెరుగుతున్న గిరాకీ

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ట్రావెల్స్‌ దోపిడీ

కాటేస్తున్న యురేనియం కాలుష్యం

అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం

వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం

ఏపీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

అర్ధరాత్రి తమ పని కానిచ్చేశారు

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి..

నవ్వడం.. నవ్వించడం.. ఓ వరం

ఊరెళ్తున్నారా!.. అయితే ఇది ఉపయోగించండి

ఏపీ హైకోర్టు తొలి సీజేగా జీకే మహేశ్వరి ప్రమాణం

విధి చేతిలో ఓడిన యువకుడు

ఇస్మార్ట్‌ సిటీ దిశగా శ్రీకాకుళం

టపాకాసుల దందా

కన్ను పడితే.. స్థలం ఖతం! 

మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

ఇక్కడ అన్ని సౌకర్యాలూ కలవు (డబ్బులిస్తేనే..)

నేడు హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం

తుఫాన్ల ముప్పు ఆమడ దూరం

మీ దస్తావేజుకు..మీరే లేఖరి

పుకార్లను నిజమని నమ్మించేందుకు ఆపసోపాలు..

ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్‌లో ఉండేదెవరో..

‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి..

గొడ్డలి పట్టిన మహేశ్‌ బాబు

బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!

‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..