బంకర్‌లో పడిపోయిన బొగ్గులు..కేటీపీఎస్ కార్మికుడి దుర్మరణం

1 Aug, 2013 05:37 IST|Sakshi

పాల్వంచ, న్యూస్‌లైన్: పాల్వంచలోని కేటీపీఎస్ బంకర్ శుభ్రం చేస్తుండగా పైనుంచి బొగ్గులు పడడంతో తీవ్ర గాయాలతో కార్మికుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పాల్వంచలోని బొల్లేరుగూడెం నివాసి, కేటీపీఎస్ ఓ అండ్ ఎం కోల్ ప్లాంట్ బంకర్ వద్ద సీఎల్(క్యాజువల్ లేబర్)గా పనిచేస్తున్న మాలోతు జంపన్న(24) మంగళవారం సాయంత్రం ‘సీ’ స్టేషన్‌లో బంకర్‌ను శుభ్రపరుస్తున్నాడు. ఇంతలో పైనుంచి బొగ్గు పడింది. అతని నడుము వరకు బొగ్గు చేరింది. తీవ్రంగా గాయపడిన అతనిని తోటి కార్మికులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి మృతిచెందాడు.
 
 ఆర్నెల్ల కిందటే వివాహం
 జంపన్నకు ఆరు నెలల కిందటే వివాహమైంది. తండ్రి శంకర్ కొంతకాలం క్రితమే మృతి చెందా రు. అతని తల్లి లాలి కేటీపీఎస్‌ఉద్యోగిగా పని చేస్తున్నారు. జంపన్నమృతదేహాన్నిచూసిన వెం టనే భార్య సునిత స్పృహ తప్పి పడిపోయింది.
 
 ఎక్స్‌గ్రేషియా, భార్యకు ఉద్యోగం...
 మృతుని కుటుంబానికి పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, భార్యకు ఉద్యోగం ఇవ్వాలన్న డి మాండుతో కేటీపీఎస్‌ఓ అండ్‌ఎం సీఈ కార్యాల యంవద్ద వివిధ యూనియన్లు, గిరిజన సంఘం నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరితో సీఈ సమ్మయ్య చర్చించారు. మృతునికి కుటుం బానికి నాలుగులక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు, భార్య సునితను కేటీపీఎస్ హాస్పిటల్‌లో నర్సుగా నియమించేందుకు హామీ ఇచ్చా రు. అత్యవసర ఖర్చుల కింద జంపన్న కుటుంబానికి 25వేల రూపాయల నగదు ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు