ఎట్టకేలకు ఆగిన నిరాహార దీక్ష...

28 Apr, 2015 22:52 IST|Sakshi

సంతకవిటి(శ్రీకాకుళం జిల్లా): కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ గత నాలుగురోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన కూన రాములు తన దీక్షను విరమించాడు.  మంగళవారం ఉదయం అక్కడకు చే రుకున్న రాజాం ఎమ్మేల్యే కంబాల జోగులు.. రాముల దీక్షకు మద్దతు పలకడంతో పాటు గ్రామస్తులు ఉన్నతాధికారులు కోరిక మేరకు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళారు. అక్కడ కలెక్టర్ లక్ష్మీనరసింహతో చర్చించిన అనంతరం ఆయన పాలకొండ ఆర్డీఓ సల్మాన్‌రాజ్‌తో కలసి దీక్షా శిబిరం వద్దకు మంగ ళవారం రాత్రి చేరుకున్నారు. మే నెలాఖరులోగా * 5 లక్షలు అంచనా వ్యయంతో తాత్కాలికంగా వంతెన నిర్మాణం జరుగుతుందని, ఈ మేరకు తన కోటాలో నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జూన్ రెండవ వారంలోగా పూర్తీ స్ధాయిలో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇందుకు పూర్తీ బాధ్యత వహిస్తామని పాలకొండ ఆర్డీఓ తెలిపారు. ఇందుకు గూన రాములు అంగీకరించడంతో కొబ్బరికాయ నీళ్ళు ఇచ్చి ఆర్డీఓ దీక్షను విరమింపజేశారు.

మరిన్ని వార్తలు