రైతు గుండెపై కుంపటి

14 Feb, 2015 02:27 IST|Sakshi

కుప్పం విమానాశ్రయానికి భూముల సేకరణ
సర్వం కోల్పోనున్న 300 కుటుంబాలు
భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న రైతులు
రెవెన్యూ అధికారులపై ఆగ్రహం

 
శాంతిపురం: విమానాశ్రయం కోసం ప్రభుత్వం తవు భూవుులు లాగేసుకుంటుందని తెలిసిన రైతులు ఒడ్డున పడ్డ చేపల్లాగా విలవిలలాడుతున్నారు. నేల తల్లిని నవుు్మకున్న తవును అభివృద్ధి, వివూశ్రయుం పేరుతో సేద్యానికి దూరం చేస్తున్నారని వాపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.  కుప్పం నియోజకవర్గంలోని  శాంతిపురం-రావుకుప్పం వుండలాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున భూవుులు వృధాగా ఉండటంతో రైతులు వీటిని అభివృద్ధి చేసి సాగుకు అనువుగా వూర్చారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొంది వందలాది కుటుంబాలు ఇక్కడ సాగు చేస్తున్నారుు. బోరుబావుల కింద 190 ఎకరాల్లో అరటి, బంగాళాదుంప, టమోట, వుల్బరీ పంటలు వివిధ దశల్లో ఉన్నారుు. మామిడి తోటలు 95 ఎకరాలు, నీలగిరి తోటలు 30 ఎకరాలు ఉన్నారుు. తవుకు జీవనాధారంగా ఉన్న భూవుులు ఇచ్చేందుకు రైతులు సమేమిరా అంటున్నారు. కొందరు వూత్రం ఎకరాకు రూ. ఐదు లక్షల పరిహారంతోపాటు కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని కోరుతున్నారు. కుటుంబంలో ఒకరికి ఎరుుర్‌పోర్టులో పర్మినెంటు ఉద్యోగం, పక్కా ఇళ్లు నిర్మించి కావాలని డివూండ్ చేస్తున్నారు.

మా శవాలపై ఎరుుర్‌పోర్డు కట్టండి
 
కుప్పం నియోజకవర్గంలో వివూనాశ్రయు నిర్మాణం కోసం శాంతిపురం, రావుకుప్పం వుండలాల సరిహద్దుల్లోని 1,056.58 ఎకరాల భూవుుల సేకరణకు ప్రభుత్వం పూనుకుంది. వుూడు నెలలుగా సర్వేలకు పరిమితమైన రెవెన్యూ అధికారులు ఇప్పుడు రైతులను ఒప్పించే ప్రయుత్నాలకు శ్రీకారం చుట్టారు. భూవుులు కోల్పోయే రైతులతో శాంతిపురం తహశీల్దార్ కల్పనాకువూరి అవ్మువారిపేట వద్ద గురువారం సవూవేశం నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు పరిహారం, ఇళ్లు కోల్పోయే వారికి పక్కా ఇళ్లు ఇస్తుందని చెప్పారు. తవు ప్రాణాలు ఉన్నంత వరకు భూవుులను ఎవరికీ ఇవ్వబోవుని రైతులు తేల్చి చెప్పారు.  తలా ఇంత విషం ఇచ్చి చంపేసి సవూధులపై ఎరుుర్‌పోర్టు కట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మూకువ్ముడిగా వాదనకు దిగటంతో తహశీల్ధార్ అర్ధంతరంగా సవూవేశం ముగించి భూముల పరిశీలనకు వెళ్లిపోయూరు.

మా సమాధులపై కట్టుకోండి

మా భూములను లాక్కుని బికారులు చేసే బదులు ఇంత విషం ఇచ్చి చంపేసి  సవూధులపై ఎరుుర్‌పోర్టు కట్టుకోండి. సేద్యం తప్ప వురో పని తెలియుని మేం భూవుులు కోల్పోరుు ఎలా బతకాలి? ఇక్కడ ఉన్న 4.5 ఎకరాల భూమి తప్ప వూకు సెంటు భూమి కూడా లేదు. మొత్తం లాక్కోవటం కంటే వూ ప్రాణాలు తీస్తేనే ఆనందంగా ఉంటుంది.
- నారాయుణప్ప, రైతు, విజలాపురం.
 
రైతులంటే బిక్షగాళ్లా?


 సాగు భూవుులను తీసుకుని ఎకరాకు రూ.50 వేలు ఇస్తారంట. భూమిని నవుు్మకుని బతికే రైతులను ప్రభుత్వ భిక్షగాళ్లని అనుకుంటోందా? రైతు లేకపోతే లోకమే పస్తులతో చస్తుంది. ఉన్న వుూడు ఎకరాలలో పంటలు పెట్టి 16 వుంది ఉన్న కుటుంబం బతుకుతోంది. ఇప్పుడు వూ నోటికాడ కూడును తన్నుకుపోయే ప్రయుత్నం చేస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు దీనికి ఒప్పుకోం.
 - గోవిందప్ప, రైతు, అవ్మువారిపేట
 
విమానాశ్రయానికి సేకరించదలచిన భూము వివరాలు

శాంతిపురం మండలంలోని అ్మ్వారిపేట రెవెన్యూలోని 219.01 ఎకరాల అసైన్డ్, 175.13 ఎకరాల ప్రభుత్వ భూమి, రావుకుప్పం వుండలంలోని కిలాకిపోడు రెవెన్యూలో 498.10 ఎకరాల అసైన్డ్, 41.5 ఎకరాల ప్రభుత్వ భూమి, విజలాపురం రెవెన్యూలోని 19.52 ఎకరాల అసైన్డ్, 98.32 ఎకరాల ప్రభుత్వ భూవుుల సేకరణకు నిర్ణరుుంచారు. గత వుూడు నెలలుగా సర్వేలకు పరిమితమైన రెవెన్యూ అధికారులు ఇప్పుడు రైతులను ఒప్పించే ప్రయుత్నాలకు శ్రీకారం చుట్టారు. పూర్తి స్థారుు పునరావాసం,  పర్మినెంట్ ఉద్యోగం, రెండు ఎకరాల సాగు భూమి, పక్కా ఇళ్లు కావాలని కొందరు కోరుతున్నారు. కొందరు వూత్రం భూవుులు వదిలేది లేదని తెగేసి చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు